VIDEO: హన్మకొండలో పోలీసుల సేవలకు సలాం
HNK: నగరంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఇళ్లలోకి నీరు చేరిన బాధితులను పోలీసులు కేంద్రాలకు తరలించారు. JCB సహాయంతో వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. దీంతో పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి