విద్యార్థినిలకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

విద్యార్థినిలకు సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: మనుబోలు హైస్కూల్ ఆవరణంలో మండలంలోని 8, 9 తరగతుల విద్యార్థులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం సైకిళ్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో 3124 సైకిళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటికీ 1841 సైకిళ్లను ఇచ్చామని, మిగతావి త్వరలో ఇస్తామన్నారు.