'శిధిలావస్థలో ఉన్న ఇంటి యజమానులను అప్రమత్తం చేయాలి'

'శిధిలావస్థలో ఉన్న ఇంటి యజమానులను అప్రమత్తం చేయాలి'

WNP: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్దామందడి మండలం జంగమయ్యపల్లిలోని పోలికల బాలస్వామి ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనపై అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ గురువారం ఉదయం గ్రామాన్ని సందర్శించి, స్వయంగా పరిశీలించారు. ఈ మేరకు ఆయన బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయం అందిస్తామన్నారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.