Gmailలో అదిరిపోయే ఫీచర్ మీకు తెలుసా?
Gmailలో ముఖ్యమైన మెయిల్స్‌ను సరైన సమయంలో పంపేందుకు 'Schedule Send' ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. మెసేజ్‌ను ముందుగానే టైప్ చేసి, పంపాల్సిన సమయాన్ని ఎంచుకోవచ్చు. మెయిల్ వివరాలు ఎంటర్ చేసిన తర్వాత, పైభాగంలోని మూడు చుక్కలపై క్లిక్ చేసి Schedule Sendను ఎంపిక చేస్తే, ఆ నిర్దేశిత సమయంలో మెయిల్ ఆటోమేటిక్‌గా వెళ్తుంది. ఈ ఫీచర్‌ను మొబైల్లో కూడా వినియోగించవచ్చు.