హిందూపురం చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం చేరుకున్నారు. స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న ఆయనకు ఈరోజు సాయంత్రం పౌర సన్మానం జరగనుంది. పట్టణంలోని MGM స్కూల్ గ్రౌండ్స్‌లో స్థానిక నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభంకానుందని మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ తెలిపారు.