పట్టణంలో అనధికార బోర్లు

CTR: పుంగనూరు పట్టణ పరిధిలో పలువురు సొంత ప్రయోజనాల కోసం అనధికారికంగా బోర్లు డ్రిల్ చేస్తున్నారంటూ శుక్రవారం రాత్రి స్థానికులు వాపోయారు. పుంగనూరు డ్రై ఏరియా పరిధిలో ఉన్నా అనుమతులు లేకుండా బోర్లు డ్రిల్ చేయడం ద్వారా నీరు త్వరగా అడుగంటిపోయి వేసవిలో నీటి ఎద్దడి తప్పదని ప్రజలు చర్చించుకుంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.