రాయచోటిలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన
అన్నమయ్య: రాయచోటిలో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. పోలీస్ అధికారులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.