అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేసిన మంత్రి

NGKL: పెంట్లవెల్లి మండలం యంగంపల్లి తండాలో శుక్రవారం 'పనుల జాతర' కార్యక్రమంలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ మోహన్ కృష్ణ, మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.