కడపలో మున్సిపల్ కార్మికుల టోకెన్ సమ్మె

కడపలో మున్సిపల్ కార్మికుల టోకెన్ సమ్మె

కడప జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట టోకెన్ సమ్మె నిర్వహించారు. పెండింగ్ వేతనాలను చెల్లించి, మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు కోరారు. అదనపు కార్మికుల వేతనాలు పెంచి వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.