బాలాన్ పల్లి తండాలో కూలిపోయిన ఇల్లు
NGKL: తాడూరు మండలంలోని బాలాన్ పల్లి తండాలో భారీ వర్షాల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. తండాకు చెందిన మేఘావత్ సోమ్లా నాయక్ ఇల్లు కూలిపోవడంతో, అతనికి నివాసం లేకుండా పోయింది. పాత ఇళ్లు, మట్టి ఇళ్లల్లో ఉండవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇల్లు కూలిపోయిన బాధితుడు సోమ్లా నాయక్, తమను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.