ప్రైవేటు వాహనాలతో నిండిన ఉప్పల్ రింగ్ రోడ్డు..!
MDCL:ఆర్టీసీ బంద్ నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు సాయంత్రం ప్రైవేట్ వాహనాలతో నిండిపోయింది. వరంగల్, హనుమకొండ, తొర్రూరు, భూపాలపల్లి, భువనగిరి, జనగాం, తిరుమలగిరి, మోత్కూరు, సహా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతుండగా, చివరికి ప్రైవేటు టాక్సీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ప్రైవేటు టాక్సీలు గత రేట్లతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 30% పెంచేశారు.