24.7 కేజీల గంజాయి పట్టివేత

BDK: ఎండు గంజాయిని ద్విచక్ర వాహనాలపై రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను భద్రాచలం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 24.7 కేజీల ఎండు గంజాయితోపాటు మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు.