భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ
సత్యసాయి: రొద్దం మండలం చిన్నమంతూరు గ్రామంలో హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి శుక్రవారం పర్యటించారు. ఆంజనేయస్వామి దేవస్థానం దగ్గర రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం రొద్దం హెడ్ క్వార్టర్‌లోని మసీదు దగ్గర రూ. 6.50 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.