బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
NLR: గుడ్లూరు దుర్ఘటనలో గాయపడిన పవన్, భార్గవ్ కుటుంబాలను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు గురువారం రాత్రి ఆసుపత్రిలో పరామర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.