బ్లాక్ బర్లీకి ఊరట.. పొగాకు బోర్డులో చేర్పు

బ్లాక్ బర్లీకి ఊరట.. పొగాకు బోర్డులో చేర్పు

GNTR: రాష్ట్ర వ్యాప్తంగా సాగుచేస్తున్న బ్లాక్ బర్లీ పొగాకు చివరకు పొగాకు బోర్డు పరిధిలోకి వచ్చింది. కొన్నేళ్లుగా ధరల ఉత్కంఠతో కష్టాలు ఎదుర్కొన్న రైతులకు ఈ నిర్ణయం ఊరటగా మారింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో 10వేల ఎకరాల సాగుతో సహా మొత్తం 3 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. ఈ నేపథ్యంలో రైతు సంఘాల పోరాటం ఫలవంతమై బ్లాక్ బర్లీని బోర్డులోకి చేర్చినట్టు రైతులు తెలిపారు.