ఉలవపాడు ఎస్ఐగా సుబ్బారావు బాధ్యతలు
NLR: ఉలవపాడు నూతన ఎస్ఐగా సుబ్బారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, జూదం, అక్రమ మద్యం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. కొత్త ఎస్ఐకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం పనిచేసిన ఎస్ఐ అంకమ్మరావు బదిలీపై వెళ్లారు.