కేసముద్రంలో యూరియా కోసం ఉ.6 నుంచి పడిగాపులు

MHBD: యూరియా కోసం అన్నదాత కష్టాలు రోజురోజుకూ మరి ఎక్కువైపోతున్నాయి. ఉదయం ఆరుగంటల నుంచే అన్నదాతలు యూరియా కోసం పడిగాపులు గాస్తున్నారు. పసిపిల్లలను సంకనేసుకొని మరీ మహిళలు క్యూ లైన్‌లో నిల్చున్నారు. కేసముద్రం మండలం ఉప్పరిపల్లి రైతువేదిక వద్ద కనిపించిన దృశ్యం ఇది. తమకు సరిపడ యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.