ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే గ్రామపంచాయతీ భవనం

JGL: ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామపంచాయతీ భవన నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే నిలిచిపోయింది. మూలరాంపూర్ గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణానికి ఈజీఎస్ నిధుల నుంచి రూ.13లక్షలు మంజూరయ్యాయి. కొత్త భవన నిర్మాణ పనులను 2017లో అప్పటి ఎమ్మెల్యే ప్రారంభించారు. పనులు ప్రారంభించి 8ఏళ్లు గడుస్తున్నప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.