కనిగిరిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఎస్ఐ

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని పలు లాడ్జిలను హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాడ్జిలలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. లాడ్జిలలో బస చేసే వారి వివరాలు పక్కాగా నమోదు చేయాలని, అనుమానిత వ్యక్తులపై సమాచారం వెంటనే పోలీసులకు తెలపాలన్నారు