ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు అందుకున్న ప్రతాప్

WGL: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరానికి చెందిన ప్రతాప్ రాష్ట్ర ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని గ్రీన్ ల్యాండ్స్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమాచార, పౌర సంబంధాల కమిషనర్ సీహెచ్ ప్రియాంక, మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రతాప్ ఈ అవార్డు తీసుకున్నారు.