టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీపీ

టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీపీ

ప్రకాశం: కనిగిరి వైసీపీ ఎంపీపీ దంతులూరి ప్రకాశం, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద చెర్లోపల్లి మండలంలోని లింగన్నపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకాశంకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు ప్రకాశంకు సూచించారు.