ప్రభుత్వ వైద్య కళాశాలలను కాపాడుకుందాం: మక్బూల్‌

ప్రభుత్వ వైద్య కళాశాలలను కాపాడుకుందాం: మక్బూల్‌

SS: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి అందరూ ఉద్యమించాలని కదిరి YCP ఇన్‌ఛార్జ్ బీఎస్ మక్బూల్ పిలుపునిచ్చారు. తనకల్లు మండలంలోని ఈతోడు, బాలసముద్రం, తనకల్లు పంచాయతీలలో నిర్వహించిన "రచ్చబండ, కోటి సంతకాల సేకరణ" కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ప్రజా వైద్య వ్యవస్థను ప్రైవేట్ చేతుల్లోకి నెట్టడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మక్బూల్ విమర్శించారు.