ఇంటి నుంచి వెళ్లిన యువతిని గుర్తించిన పోలీసులు
VSP: చదువు విషయమై తండ్రితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన పాడేరు యువతిని విశాఖలోని ఎం.ఆర్.పేట పోలీసులు గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు సాంకేతిక పద్ధతులతో ఆమె ఆచూకీ కనుగొన్నారు. సీఐ దివాకర్ యాదవ్ కౌన్సిలింగ్ ఇచ్చి, ఆమెను ఆదివారం సాయంత్రం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.