నేడు బెంగళూరు వెళ్లనున్న సీఎం రేవంత్
TG: పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో రేపు సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్లనున్నారు. బెంగళూరు నుంచి రేపు ఉదయం బయల్దేరి పుట్టపర్తిలోని సత్యసాయి ఉత్సవాలకు హాజరుకానున్నారు. కాగా పుట్టపర్తి ఉత్సవాల్లో ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొననున్నారు.