VIDEO: వర్షం.. రైతులకు అపార నష్టం

NZB: వర్ని మండలం పాత వర్నిలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతన్నలు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామ శివారులోని ఓ రైస్ మిల్లు వద్ద పంట పొలాలు పూర్తిగా పాడైపోయాయి. వరి పొలాలు చాలా రోజుల నుంచి నీటిలోనే ఉండటంతో పొలంలోని పంట మొత్తం కుళ్లి పోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు సర్వే చేసి తమను ఆదుకోవాలన్నారు.