GOVT జాబ్స్.. నేడు సర్టిఫికెట్ల పరిశీలన

మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ రోజు ఉదయం 10 గంటలకు జోగులాంబ గద్వాల జోన్-7 నుంచి TGPSC ద్వారా ఎంపికైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని అధికారి సుదర్శన్ తెలిపారు. అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలు, మూడు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.