చెరువుల పూడిక తీత పనులను పరిశీలించిన ఏపీవో

చెరువుల పూడిక తీత పనులను పరిశీలించిన ఏపీవో

WGL: దుగ్గొండి మండలం పోనకల్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన చెరువుల పూడిక తీత పనులను ఏపీవో శ్రీనివాసు పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించారు. కార్మికులకు సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పని ప్రదేశంలో కార్మికులకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.