వేములలో బోల్తా పడ్డ ఆటో.. ముగ్గురికి గాయాలు

వేములలో బోల్తా పడ్డ ఆటో.. ముగ్గురికి గాయాలు

KDP: వేముల మండలం అమ్మయ్యగారి పల్లె వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే అనంతపురం జిల్లా ఇల్లందుకు చెందిన కుటుంబం స్వామి దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నూరు మహమ్మద్ సహా ఇద్దరికి గాయాలు అయ్యాయని సమాచారం.