ఆర్మూర్ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రావణి
NZB: ఆర్మూర్ నూతన మున్సిపల్ కమిషనర్ శ్రావణి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, రెవెన్యూ ఆఫీసర్ ఉమాదేవి, సానిటరీ సూపర్వైజర్ నరేందర్, సీనియర్ అసిస్టెంట్ శేఖర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు.