శాంతి భద్రత పరీరక్షణకు సహకరించండి: సీఐ

ELR: భీమడోలు సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేపడుతున్న చర్యలకు జాతీయ రహదారులపై రెస్టారెంట్లు , దాబాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు సహకరించాలని సీఐ విల్సన్ కోరారు. సర్కిల్ కార్యాలయంలో బుధవారం నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్వాహకులు తమ వ్యాపార స్థలాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.