టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి: SP

ELR: దీపావళి పండుగలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ప్రజలకు సూచించారు. అలాగే అనుమతులు కలిగిన వారు మాత్రమే బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అక్రమ బాణసంచా నిలువలు ఉంచిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ప్రజలకి దీపావళి శుభాకంక్షలు తెలిపారు.