'తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'

'తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'

SKLM: రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని ఎస్సై రమేష్ బాబు సూచించారు. బుధవారం మెళియాపుట్టిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని పేర్కొన్నారు.