పోలింగ్ సక్సెస్.. మరి కొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రారంభం
SRPT: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ, అప్పటికే క్యూలలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీని కొనసాగింపుగా.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. మరోవైపు రెండో విడత ఎన్నికల ప్రచారంలో నాయకులు తీవ్రంగా బిజీగా ఉన్నారు.