ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: కలెక్టర్
NRML: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. డ్యాంగాపూర్ ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని, తల్లిదండ్రులు సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. పాఠశాల ప్రహరీ గోడ, నీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించారు.