తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ అక్క మృతి

తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ అక్క మృతి

ATP: ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.