కోర్టులో శిక్ష పడుతుందేమో అని భయంతో ఆత్మహత్య!

NTR: విజయవాడ నగరంలోని ఊర్మిళానగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. షేక్ బాజీ షరీఫ్ అనే యువకుడు ఓ కేసులోముద్దాయిగా ఉన్నాడు. ఓ మహిళ.. షరీఫ్ తన వెంట పడుతున్నాడని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసు విషయమై కోర్టులో శిక్ష పడుతుందేమో అని భయంతో ఉరి వేసుకొని మృతి చెందాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.