పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్

పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్

కోనసీమ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుసే అవకాశం ఉందన్నారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో కె.శ్రీరమణి తెలిపారు. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా 99493 93805ను సంప్రదించాలని సూచించారు. అధికారులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.