'జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి'
NLG: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం కార్యాలయంలోని పరిపాలన అధికారి మోతిలాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అయూబ్ మాట్లాడుతూ.. నూతన అక్రిడేషన్ కార్డులను జారీ చేయాలని కోరారు.