టీడీపీ బీసీల పార్టీ అని మరోసారి రుజువు: ఎంపీ నాగరాజు
కర్నూలు: నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నూతన జిల్లా అధ్యక్షురాలిగా గుడిసె కృష్ణమ్మ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్ష పదవుల్లో బీసీలకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కృష్ణమ్మను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణమ్మ నాయకత్వంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందన్నారు.