సింగిల్ విండో డైరెక్టర్ పదవికి రాజీనామా
KMR: మద్నూర్ సింగిల్ విండో పరిధిలోని టీసీ నంబర్ 9 సొసైటీ డైరెక్టర్ కొండావార్ అంజవ్వ తమ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని సింగిల్ విండో కార్యదర్శి గంగాధర్‌కు అందజేశారు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా పంచాయితీ ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి అడ్డు రాకుండా సింగిల్ విండో డైరెక్టర్‌కు రాజీనామా చేసినట్లు తెలిపారు.