జిల్లాలో రూ.74 కోట్లు ఉపాధి బకాయిలు

జిల్లాలో రూ.74 కోట్లు ఉపాధి బకాయిలు

ASR: జిల్లాలో గల 22 మండలాల్లో 60 వేల ఉపాధి హామీ పనులు చేసే కుటుంబాలకు రూ.74 కోట్లు వేతనాలు ఇవ్వాల్సి ఉందని జిల్లా డ్వామా PD డా. డీ. విద్యాసాగర్ మంగళవారం తెలిపారు. 5 నెలలుగా పని చేసినందుకు ఈ మొత్తాన్ని ఇవ్వాలన్నారు. ఈ వారంలో నిధులు విడుదల అవుతాయని అన్నారు. పని చేసిన వారి ఖాతాల్లో సొమ్ములు జమ అవుతాయని తెలిపారు.