VIDEO: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: ఎమ్మెల్యే
E.G: కొవ్వూరులోని యానాది కాలనీలో శనివారం 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ భావన రత్నకుమారి ఉన్నారు.