కావలిలో రూ.700 కోట్ల భూ కుంభకోణంపై విజిలెన్స్ దర్యాప్తు

కావలిలో రూ.700 కోట్ల భూ కుంభకోణంపై విజిలెన్స్ దర్యాప్తు

నెల్లూరు: కావలిలో గత వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాలపై విజిలెన్స్ విచారణ మొదలైంది. పంట కాలువలు, శ్మశానాలు కబ్జా చేసి లేఅవుట్లు వేశారు. సుమారు రూ.700 కోట్ల విలువైన 128 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు ప్రాథమిక అంచనా. 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇస్తామని విజిలెన్స్ సీఐ తెలిపారు.