VIDEO: వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల కొరత
WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరతతో పాటు తాగునీటి సదుపాయం లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తోంది. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులు నీరు అందక అవస్థలు పడుతున్నారు. మౌలిక వసతులు మెరుగుపర్చాలని, తక్షణమే నీటి సరఫరా ఏర్పాటు చేయాలని శుక్రవారం స్థానికులు కోరుతున్నారు.