బోడుప్పల్‌లో మున్సిపల్ సిబ్బందికి రైన్ కోట్లు పంపిణీ

బోడుప్పల్‌లో మున్సిపల్ సిబ్బందికి రైన్ కోట్లు పంపిణీ

మేడ్చల్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బోడుప్పల్ నగర పాలక సంస్థ మున్సిపల్ సిబ్బందికి రైన్ కోట్లు పంపిణీ చేశారు. కమిషనర్ ఎ.శైలజా సిబ్బందికి స్వయంగా రైన్ కోట్లు అందజేశారు. ఈ సందర్భంగా సానిటరీ ఇన్‌స్పెక్టర్ బి.నారాయణ రెడ్డి, జవాన్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. శ్రామికుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.