విద్యార్థులు లక్ష్యంతో చదవాలి: ట్రైనీ కలెక్టర్

విద్యార్థులు లక్ష్యంతో చదవాలి: ట్రైనీ కలెక్టర్

NRPT: ధన్వాడ మండలంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన ట్రైనింగ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. సరైన ప్రణాళికతో విజయం సాధించవచ్చని మార్గదర్శనం చేశారు. ఈ సదస్సులో సర్పంచ్ కొండయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.