VIDEO: కిష్టాపురం సర్పంచ్ ఏకగ్రీవం
WGL: రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో శుక్రవారం సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కొండం బ్రదర్స్ సేవలకు కృతజ్ఞతగా గ్రామస్తులు పార్టీలకు అతీతంగా కొండం రంగారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్‌తో పాటు ఎనిమిది వార్డులు కూడా ఏకగ్రీవంగా ఎంపికయ్యాయి. అధికారిక ప్రకటన నామినేషన్ల గడువు పూర్తయ్యాక వెలువడనుంది.