ఆధార్ ధ్రువీకరణతో మొబైల్ నంబరు అప్‌డేట్
యాక్సిస్ బ్యాంక్ తమ ఖాతాదారుల కోసం వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబరును సులభంగా అప్‌డేట్ చేసుకునేందుకు మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో ఆధార్ ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఖాతాదారులు ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబరును ఆన్‌లైన్‌లోనే సురక్షితంగా మార్చుకోవచ్చు.