గుండెపోటుతో రైతు మృతి

PLD: నూజెండ్ల మండలంలోని దాట్లవారిపాలెం గ్రామానికి చెందిన రైతు మారెళ్ళ నాగిరెడ్డి (55) గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..పొలం పనుల నిమిత్తం ఉదయాన్నే పొలానికి వెళ్లిన నాగిరెడ్డికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.