అధికారులతో ఎంపీ, ఎమ్మెల్యేలు సమీక్ష

ఒంగోలు నగరానికి పడమర బైపాస్ సాధ్యాసాధ్యాలపై హైవే అధికారులతో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఎస్.ఎన్.పాడు బీఎన్ విజయ కుమార్‌లు సమీక్షించారు. ఒంగోలు కలెక్టరేట్లో నేషనల్ హైవే అధికారులతో సోమవారం నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో వారు మాట్లాడారు. బైపాస్ వెళ్లే ప్లాన్, సమీప గ్రామాలు తదితర అంశాలపై సమీక్షించారు.